
రైతులు ఆందోళన చెందొద్దు
● 900 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంది ● కలెక్టర్ రాహుల్‌రాజ్
పాపన్నపేట(మెదక్)/టేక్మాల్/అల్లాదుర్గం: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం జిల్లాలో 900 మెట్రిక్ టన్నులు అందు బాటులో ఉందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని లక్ష్మీనగర్‌లో ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. కొంతమంది యూ రియా కొరత ఉందని వదంతులు సృష్టించడంతో రైతులు సెప్టెంబర్‌లో కొనాల్సిన యూరియాను ముందుగానే కొంటున్నారని తెలిపారు. అలాగే మండల కేంద్రమైన టేక్మాల్‌లో రైతు ఆగ్రోస్ కేంద్రాన్ని సందర్శించి యూరియా నిల్వలపై ఆరా తీశారు. 10 రోజుల్లో సుమారు 1,000 నుంచి 1,500ల మెట్రిక్ టన్రుల యూరియా అదనంగా వస్తుందని చెప్పారు. యూరియా వాడకంపై రైతు ల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యవసాయాధికారి రాంప్రసాద్‌ను అభినందించారు. అనంతరం అల్లాదు ర్గం మండలం బంటికుంట గండితో పాటు దెబ్బతిన్న చిల్వెర చెరువును కలెక్టర్ పరిశీలించారు. ధ్వంసమైన రోడ్లను పూర్తిస్థాయి విచారణ జరిపి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
మెదక్ కలెక్టరేట్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్‌తో కలిసి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 27 నుంచి జరిగే గణేష్ ఉత్సవాలను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు.