
అదే తీరు.. అదే లైను!
చేగుంట మండలంలోని మక్కరాజీపేటలో బుధవారం యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. యూరియా వస్తుందన్న సమాచారంతో సహకార సంఘం కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు వస్తుందని అధికారులు తెలపడంతో ఆగ్రహించి రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. ఇబ్రహీంపూర్‌లో యూరియా కోసం గంటల పాటు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కౌడిపల్లిలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. భాగ్యలక్ష్మి ట్రేడర్స్‌కు 400బస్తాల యూరియా రావడంతో ఉదయం నుంచే టోకెన్ల కోసం రైతువేదిక వద్ద క్యూ కట్టారు. – చేగుంట(తూప్రాన్)/ కౌడిపల్లి(నర్సాపూర్)