
రాజీవ్‌గాంధీకి ఘన నివాళి
నర్సాపూర్: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయ ంతి సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో నాయకులు నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్లు మంజూరు చేయండి
మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
రామాయంపేట(మెదక్): మెదక్ నియోజకవర్గ పరిధిలో విద్యుత్ కోతల నివారణకు అద నంగా సబ్‌స్టేషన్లు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పాపన్న పేట మండలం యూసూఫ్‌పేట, హవేళిఘణాపూర్ మండలం బ్యాతోత్, మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల పరిధిలో అదనంగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు అత్యవసరమని అన్నారు. ఇటీవల విద్యుత్ కోతలు తీవ్రతరం అవుతున్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాశారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలి
పాపన్నపేట(మెదక్): ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి, పాత ఫించన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షుడు పంతులు రాజు డిమాండ్ చేశారు. బుధవారం పాపన్నపేట ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత ఫించన్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గురునాథ్, హెచ్‌ఎం మహేశ్వర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, అంజనాచారి, టీచర్లు వెంకటేశం, అంజాగౌడ్, భట్టు నాగరాజు, వేణుగోపాల్, ప్రవీణ్, శ్రీహరి, నింగప్ప, మోహన్‌రావు, కృష్ణకాంత్, రమేష్, ఇందిర, రజిత పాల్గొన్నారు.
పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలి: డీఎల్‌పీఓ
పెద్దశంకరంపేట(మెదక్): గ్రామాల్లో మురుగు కాల్వలను వెంటనే శుభ్రపర్చాలని, దోమలు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు డీఎల్‌పీఓ సురేశ్‌బాబు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట, కట్టెల వెంకటాపూర్, ఇసుకపాయ తండాలలో ఆయన పర్యటించారు. రికార్డులు పరిశీలించి, సిబ్బందికి సూచనలిచ్చారు. అనంతరం తండాలోని పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీ పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
చిలప్‌చెడ్(నర్సాపూర్): భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సూచించారు. బుధవారం మండల పరిధిలోని చిట్కుల్ శివారులో గల పాత వంతెనపై ప్రవహిస్తున్న మంజీరా నదిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిట్కుల్ వంతెన వద్ద ప్రస్తుత పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయన్నారు. అధికారులు పాత వంతెన వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారని తెలిపారు. రైతులు, ఆలయానికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ప్రశాంత్, అర్‌ఐ సునీల్‌సింగ్ త దితరులు ఉన్నారు.