
పఠనాసక్తిని పెంపొందించాలి
చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట/ మెదక్ కలెక్టరేట్ /తూప్రాన్: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చదువు నేర్పాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండలంలోని మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాల మేళాను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు ఆసక్తిగా చదువుకునే విధంగా బోధనోపకరణాలతో చదివించాలన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మోడల్ స్కూల్‌లో ఏర్పాటుచేసిన మండల స్థాయి టీఎల్‌ఎం మేళాను సందర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీఎల్‌ఎం మేళాలో పాల్గొన్నారు. అలాగే తూప్రాన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి హాజరయ్యారు.
మాదకద్రవ్యాలకు
దూరంగా ఉండాలి
నర్సాపూర్: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు మాదక ద్రవ్యాల నిరోధక కార్యక్రమం నిర్వహించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లా డుతూ.. మాదక ద్రవ్యాలతో జీవితం నాశనం అవుతుందని, ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే తమ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, సీఐ జాన్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్‌ఐ లింగం,ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం న ర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. గోవులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
నేడు క్రీడాకారుల ఎంపిక
మెదక్ కలెక్టరేట్: అంతర్జాతీయ పాఠశాలల వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు గురువారం మెదక్‌లో క్రీడాకారుల ఎంపిక చేపట్టనున్నట్లు పాఠశాల క్రీడా సామాఖ్య కార్యదర్శి నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు ఉదయం 9 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్‌లో ఎంపిక ఉంటుందన్నారు. క్రీడాకారులు 15 సంవత్సరాలలోపు వారై ఉండాలని, వెంట ఒరిజినల్ వయసు ధృవీకరణ పత్రం, 5 కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని రావాలన్నారు. బాలురు 8 మంది, బాలికలు 8 మందిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న రెండు జట్లు ఈనెల 18, 19 తేదీల్లో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 9985111011, 89855 36704 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మహిళలను సంఘాల్లో
చేర్పించాలి
నర్సాపూర్: మహిళలను సంఘాలలో చేర్పించాలని నాన్ ఫాం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మల్లే శం చెప్పారు. బుధవారం ఐకేపీ కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య ప్రతినిధుల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిందన్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలతో వయోవృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని, 14 నుంచి 18 సంవత్సరాల లోపు కిశోర బాలికల సంఘాలు, దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో మండల సమైఖ్య కార్యదర్శి మౌనిక పాల్గొన్నారు.
డ్రగ్స్‌ను నిర్మాలిద్దాం
అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని, జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జి ల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. బుధవారం నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో అధికారులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.