
స్వచ్ఛతకు దూరం!
పేట మున్సిపాలిటీలో కొరవడిన పరిశుభ్రత
చర్యలు తీసుకుంటున్నాం
మున్సిపాలిటీలో స్వచ్ఛత విషయమై చర్య లు తీసుకుంటున్నాం. ఈమేరకు కొంత పురో గతి సాధించాం. అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డంప్‌యార్డులో కాకుండా ఇతర ప్రదేశాల్లో వేసిన చెత్త, చెదారాన్ని తొలగిస్తున్నాం.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత కొరవడింది. తడి, పొడి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ఇతర రంగాల్లో అనుకున్న పురోగతి సాధించలేక చతికిలపడింది. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లోనూ జిల్లాలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది.
లోపించిన సమన్వయం
పట్టణాల్లో స్వచ్ఛతలో పోటీ తత్వాన్ని పెంపొందించడానికి ఏటా కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు నిర్వహిస్తుంది. చెత్త సేకరణకు సంబంధించి వివిద అంశాల ప్రతిపాదికన ఈ ర్యాంక్ నిర్ణయిస్తారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నారా..? సేకరించిన తడి, పొడి చెత్తను వేర్వేరు చేస్తున్నారా.. అనే విషయం కమిటీ పరిశీలిస్తుంది. ఈమేరకు కమిటీ సభ్యులు పట్టణంలో పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలపై స్థానికుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు ప్రత్యక్షంగా వార్డుల్లో పర్యటించి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. మున్సిపాలిటీల్లో ఆయా అంశాలకు సంబంధించి కేటాయించిన మార్కుల ఆధారంగా ర్యాంకులను ఖరారు చేశారు. కేంద్ర బృందం సభ్యులు పట్టణంలో పర్యటించిన సమయంలో స్వచ్ఛత తోపించిన విషయం ప్రత్యక్షంగా పరిశీలించి ఫొటోలు సేకరించారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో పారిశుద్ధ్యం లోపించి, దోమల బెడద తీవ్రమై స్థానికులు వ్యాధుల బారిన పడుతున్నారు. గుట్టపై ఎతైన ప్రదేశంలో ఉన్న డంప్‌యార్డులో కాకుండా పట్టణంలో సేకరించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడే వేస్తున్నారు. ఫలితంగా వార్డు ల్లో దుర్వాసన వెదజల్లుతుంది. ఈవిషయమై పలు మార్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించినా మున్సిపల్ అధికారుల వైఖరి మారలేదు. ఫలితంగా స్వచ్ఛత ర్యాంక్ దిగజారింది. ఈ విషయమై పట్టణ ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు.
మున్సిపాలిటీ రాష్ట్ర ర్యాంక్ జాతీయ ర్యాంక్
రామాయంపేట 1321, 591
పారిశుద్ధ్య నిర్వహణలో విఫలం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లోఅట్టడుగు స్థానం

స్వచ్ఛతకు దూరం!