
ఆర్టీసీలో ఓవర్ డ్యూటీ!
● రోజుకు 12 నుంచి 14 గంటల విధులు ● స్పెషల్ ఆఫ్‌లు.. సెలవులు కరువు ● ఇదేంటని అడిగితే మెమోలు.. ● ఆందోళనలో డ్రైవర్లు, కండక్టర్లు
మెదక్‌జోన్: BÈtïÜ {OyðlÐ]lÆý‡$Ï, MýS…yýlMýStÆý‡$Ï KÐ]lÆŠḥæ yýl*Åsîæ ™ø Ô>È-Æý‡-MýS…V>, Ð]l*¯]l-íÜ-MýS…V> AÌS-íÜ-´ù-™èl$-¯é²Æý‡$. °º…«§ýl¯]lÌS {ç³M>Æý‡… ÆøkMýS$ 8 VýS…rË$ Ð]l*{™èlÐól$ Ñ«§ýl$Ë$ °Æý‡Ó-Ç¢…-^é-Í. A…™èl-MýS$-Ñ$…_ ç³°^ólõÜ¢ B Ð]l$Æý‡$çÜsìæ Æøk òÜÌSÐ]l# E…r$…¨. {ç³çÜ$¢™èl… Æø kMýS$ 12 ¯]l$…_ 14 VýS…rÌS ´ër$ Ñ«§ýl$Ë$ °Æý‡ÓÇ¢…^éÍÞ Ð]lçÜ$¢…-¨. 14 VýS…rÌS ´ër$ Ñ«§ýl$ÌZÏ E…sôæ 6 VýS…r-ÌSMýS$ KÐ]lÆŠ‡ Osñæ… (Ksîæ) CÐéÓÍÞ E…yýlV>, MóSÐ]lÌS… VýS…r-¯]l²Æý‡, Ìôæ§é Æð‡…yýl$ VýS…r-ÌSMýS$ Ð]l*{™èlÐól$ Ksîæ CçÜ$¢¯é²Æý‡° íܺ¾…¨ Ðé´ù-™èl$-¯é²Æý‡$. VýS™èl…ÌZ òÜÌS-Ð]l#Ë$ C^óla-Ðé-Æý‡-°, çÜÐðl$à A¯]l…-™èlÆý‡… AÑ MýS*yé CÐ]lÓ-yýl… Ìôæ§ýl° BÐól-§ýl¯]l ^ðl…§ýl$-™èl$-¯é²Æý‡$.
100 బస్సులు.. 350కి పైగా సిబ్బంది
మెదక్ డిపోలో పల్లె వెలుగు నుంచి మొదలుకొని ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీలు మొత్తం సు మారు 100 బస్సులు ఉండగా, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది 350కి పైగా ఉన్నారు. కాగా కార్మిక చట్టాల ప్రకారం డ్రైవర్, కండక్టర్లు రోజుకు 8 గంటలు మాత్రమే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే అంతకంటే ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. కార్మికులపై వేధింపులు ఆపాలనే డిమాండ్‌తో గతేడాది జూన్‌లో 53 మంది డ్రైవర్లు 3 రోజుల పాటు బస్సులు నిలిపి వేసి సమ్మెకు దిగారు. దీంతో దిగివచ్చిన యాజమాన్యం కార్మిక చట్టం ప్రకారం వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరూ విధుల్లో చేరాలని, ఉన్నతాధికారులతో చర్చించి సమ్మె చేసిన మూడు రోజుల వేతనాలు ఇస్తామని నిరసనను విరమింపజేశారు.
నిబంధనల ప్రకారమే..
నిబంధనల ప్రకారమే డ్యూటీలు వేస్తున్నాం. అధిక సమయం పనిచేసిన వారికి ఓటీ లు ఇస్తున్నాం. గతంలో డ్రైవర్లు సమ్మె చేసిన విషయం నాకు తెలియదు. తాను గతేడాది ఆగస్టులో విధుల్లో చేరాను.
– సురేఖ, డీఎం మెదక్
రూ. 24 లక్షలు జరిమానా
అధికారుల హామీతో సమ్మె విరమించిన డ్రైవర్లు ఆ మరుసటి రోజు విధుల్లో చేరారు. అయితే డ్రైవర్లకు హక్కుల ప్రకారం న్యాయం చేయకపోగా, మూడు రోజుల పాటు బస్సులు నడపకుండా సమ్మె చేసినందుకు ఆర్టీసీకి రూ. 24 లక్షల నష్టం వచ్చిందని, ఆ మొత్తాన్ని సమ్మెలో పాల్గొన్న 53 మంది డ్రైవర్లు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఒక్కో డ్రైవర్‌కు రూ. 45 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ప్రతి నెల ఒక్కో డ్రైవర్ వేతనంలో నుంచి రూ. 5,500 చొప్పున కోతపెట్టారు. ఈక్రమంలో బాధిత డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం వేతనాల్లో నుంచి కోత పెట్టడం మానేశారు. కాగా అప్పటి నుంచి యాజమాన్యం వేధింపులు మరింతగా ఎక్కువగా అయ్యాయని డ్రైవర్లు వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మెమో ఇచ్చి ఇంక్రిమెంట్లు ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.