
జాతీయ సమైక్యత కోసమే ‘తిరంగా’
నర్సాపూర్: కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయుల్లో జాతీయతను పెంపొందించడానికే తిరంగా యాత్ర చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ చెప్పారు. బుధవారం నర్సాపూర్‌లో చేపట్టిన తిరంగా యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని స్వాగతించడం, ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా స్వదేశీ జాగరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా విద్యార్థులతో భారీ తిరంగా జెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోశ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నరమేశ్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్, పెద్ద రమేశ్‌గౌడ్, బుచ్చేశ్‌యాదవ్, రాజేందర్ పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్