
అప్రమత్తంగా ఉండండి
మెదక్ కలెక్టరేట్: మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈనెల 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఏర్పాట్లు ఘనంగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వర్షాల నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై శాఖలవారీగా దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికార యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామన్నారు. తక్షణ సాయం కోసం 9391942254 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ రమాదేవితో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పశువులకు టీకాలు తప్పనిసరి
చిలప్‌చెడ్(నర్సాపూర్): వానాకాలం సీజన్‌లో పశువులు వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని బండపోతుగల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని సందర్శించారు. రికార్డులు పరిశీలించి జీవాలకు టీకాలు వేశారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం రైతులకు పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేశారు.
జిల్లాకు భారీ వర్ష సూచన
తక్షణ సాయం కోసంకంట్రోల్ రూం ఏర్పాటు
కలెక్టర్ రాహుల్‌రాజ్