మాడాపూర్‌లో తాగునీటి సమస్య | Sakshi
Sakshi News home page

మాడాపూర్‌లో తాగునీటి సమస్య

Published Fri, May 24 2024 1:40 PM

మాడాపూర్‌లో తాగునీటి సమస్య

నర్సాపూర్‌ రూరల్‌: మండల పరిధిలోని మాడాపూర్‌లో వారం రోజులుగా తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్తులు గురువారం ఎంపీడీఓ కార్యాలయనికి వచ్చారు. ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో ఇతర అధికారులతో తాగునీటి సమస్యపై మొరపెట్టుకున్నారు. గ్రామంలో ఉన్న బోరు మోటార్‌ వారంరోజుల క్రితం పాడైపోయిందని చెప్పారు. ఆ విషయాన్ని పలుమార్లు ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శికి విన్నవించిన పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రతీరోజు తాగునీటి కోసం మహిళలు సుదూర ప్రాంతంలోని వ్యవసాయ బోర్‌ మోటార్లకు వద్దకు వెళ్లి తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి రవిని వివరణ కోరగా.. త్వరగా తాగునీటి సమస్య లేకున్నా కొంతమంది కావాలని సమస్యను సృష్టిస్తున్నారని చెప్పారు. మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతున్న బోరు మోటార్‌కు మరమ్మతులు చేయడం లేదని ఆరోపించడం విచారకరమన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement