పాతమంచిర్యాల: నేటితరం విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలే భావజాలం తెలుసుకోవాలని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిషన్ అన్నారు. శుక్రవారం పూలే ద్విశత జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే అందించిన సమతావాద భావజాలం దేశాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు. విద్యార్థులు మహనీయుల చరిత్రను అధ్యయనం చేసి వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక, బీసీ మేధావుల ఫోరం సంయుక్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, బీసీఐఎఫ్ కోఆర్డినేటర్ కొండయ్య, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు మల్లయ్య, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, కై లాసం, రాందాస్, పాషా, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


