మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇంటింటా తని ఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలు, సెల్‌ఫోన్, ఆధార్ కార్డు నంబర్లు సేకరించారు. ప త్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం కాలనీ వాసులతో ఏసీపీ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే 112కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. గంజాయి, విక్రయించి నా, సేవించినా వారి వివరాలు తెలియజేయాలన్నా రు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సైబర్ క్రైం, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, ఎనిమిది మంది ఎస్సైలు, వందమంది పోలీసులు పాల్గొన్నారు.


