నస్పూర్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురష్కరించుకుని కలెక్టరేట్ ఆవరణలో డ్రీమ్ సొసైటీ ఆధ్వర్యంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సౌజన్యంతో బాల్య వివాహాల నిరోదంపై ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహం చేస్తే రూ.లక్ష జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షె డ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గా ప్రసాద్, కలెక్టరేట్ పీవో శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథో డ్, డ్రీమ్ సొసైటీ ప్రతినిధి సంతోష్, డ్రీమ్ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు, సమన్వయకర్తలు సుజాత, నగేశ్, తదితరులు పాల్గొన్నారు.


