ఎస్టీ హాస్టల్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఎస్టీ హాస్టల్‌ తనిఖీ

Nov 28 2026 12:44 AM | Updated on Nov 28 2026 12:44 AM

మంచిర్యాలఅర్బన్‌: జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర కళాశాల వసతిగృహాన్ని (ఎస్టీ హాస్టల్‌) శుక్రవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి (డీడీ) సురేష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘పురుగుల పిండి.. పుచ్చు పప్పులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈనేపథ్యంలో వసతిగృహంలోని స్టోర్‌ రూమ్‌ను సందర్శించి బియ్యం, పప్పులు, కోడిగుడ్ల నాణ్యతను పరి శీలించారు. పిండిలో పురుగులు ఉండడంతో అవసరమైతే బయట పడేయాలని సూచించా రు. విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన భోజనాన్ని అందించాలని, స్టోర్‌ రూమ్‌లో పరిశుభ్రత పాటిస్తూ సరుకులను సక్రమంగా భద్రపరచాలని సంబంధిత వార్డెన్‌ లక్ష్మణ్‌, సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement