ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

Nov 28 2026 12:44 AM | Updated on Nov 28 2026 12:44 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

లక్సెట్టిపేట: ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని అంకతిపల్లిలో జై హనుమాన్‌ గ్రామ సంఘం, ఇటిక్యాలలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పౌరసరఫలాల అధికారి వేణుగోపాల్‌, జిల్లా మేనేజర్‌ శ్రీకళ, తహసీల్దార్‌ దిలీప్‌ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం గ్రేడ్‌ ఏ రకానికి రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441, సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాములు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దొంత అంజలి, తదితరులు పాల్గొన్నారు.

రైస్‌మిల్‌ను పరిశీలించిన కలెక్టర్‌

జన్నారం: మండలంలోని మొర్రిగుడలో ఉన్న రాఘవేంద్ర రైస్‌ మిల్లును కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పరిశీలించారు. రైస్‌మిల్లులో చేరిన ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్‌ చేసి బియ్యం అందించాలని మిల్లు యజమానికి సూచించారు. ఇప్పటి వరకు బకాయి ఉంటే వెంటనే చెల్లించాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ రాములు, ఎంపీడీవో ఉమర్‌ షరీఫ్‌, తహసీల్దార్‌ బక్కయ్య, తదితరులు ఉన్నారు.

విద్యార్థులకు అసౌకర్యం కలిగించొద్దు

దండేపల్లి: పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, విద్యార్థులకు ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేకాధికారులు చొరవ తీసుకోవాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచించారు. దండేపల్లి కేజీబీవీని శుక్రవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, వసతులు పరిశీలించారు. అంతకు ముందు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించి గదుల మరమ్మతు పనులు పరిశీలించారు. అనంతరం లింగాపూర్‌ సమీపంలోని శ్రీకృష్ణ ఆగ్రో ఇండ్రస్ట్రీస్‌ రైస్‌మిల్‌ను సందర్శించి సీఎంఆర్‌ బకాయిలు త్వరగా అందించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో జాగర్లమూడి ప్రసాద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement