గ్రామీణుల ఉపాధి హక్కులు కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామీణుల ఉపాధి హక్కులు కాపాడాలి

Nov 28 2026 12:44 AM | Updated on Nov 28 2026 12:44 AM

బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్‌జీ పేరును రద్దు చేసి గ్రామీణ ప్రజల ఉపాధి హక్కులను కాపాడాలని భారతీయ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ (బీకేఎంయూ) జాతీయ సమితి సభ్యుడు అక్కెపల్లి బాపు డిమాండ్‌ చేశారు. శుక్రవారం బీకేఎంయూ జాతీయ సమితి పిలుపు మేరకు కలెక్టరేట్‌లో మెమోరాండం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరును పునరుద్ధరించాలని, కూలీలకు ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుచేసి వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని, 55 ఏళ్లు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.5 వేల చొప్పున ఫించన్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు దేవవరం, జిల్లా కార్యదర్శి జీసీ మాణిక్యం, జిల్లా సహాయ కార్యదర్శి బి.లక్ష్మీనారాయణ, బెల్లంపల్లి పట్టణ సీ పీఐ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, నాయకులు ర త్నం రాజం, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement