ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

Nov 26 2026 12:24 AM | Updated on Nov 26 2026 12:24 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ● కమిషనరేట్‌కు ట్రెయినీ ఏసీపీలు

మంచిర్యాలక్రైం: ప్రజలకు మెరుగైన పోలీసింగ్‌ సేవలు అందించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. గ్రూప్‌–1 అధికారిగా పోలీసు శాఖలో డీఎస్పీ(ఏసీపీ)గా శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు ప్రొబేషనరీ అధికారులు సీహెచ్‌.ఆదిశేషురెడ్డి, ఎండీ.తాజొద్దీన్‌, బీ.ఐశ్వర్య, దుగ్గిరెడ్డి హరిప్రియను రామగుండం కమిషనరేట్‌కు కేటాయించారు. బుధవారం వారు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ల నిర్వహణ, నేరాల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్‌ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో మెళకువలను అనుభవజ్ఞులైన పోలీస్‌ అధికారుల నుంచి నేర్చూకోవాలని, ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement