తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చడంతోపాటు చెత్తను కంప్రెస్ చేసేందుకు రూ.78 లక్షలతో షెడ్డింగ్ మిషన్లు, ఎయిర్ బ్లోయర్ మెషిన్, బెయిలింగ్ మెషిన్లు కొనుగోలు చేశాం. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, 25కేవీ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.11లక్షలు చెల్లించాం. బయటి ఏజెన్సీకి బాధ్యతలు ఇచ్చాం. మెషిన్లను వారే రన్ చేసి మున్సిపల్ కార్పొరేషన్‌కు డబ్బులు చెల్లిస్తారు. చెత్తను వేరు చేసి, బెయిలింగ్ మిషన్ పెద్ద కుప్పలను చిన్నగా చేస్తారు. పొడి చెత్తను కంపోస్టు చేస్తారు. పనులు మొదలైన కొన్ని నెలల్లోనే డంపింగ్‌యార్డులోని చెత్త పూర్తిగా తొలగిపోతుంది.
– అన్వేష్, మంచిర్యాల నగర కమిషనర్


