ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ రద్దు చేయాలి

Nov 26 2026 12:24 AM | Updated on Nov 26 2026 12:24 AM

పాతమంచిర్యాల: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ రద్దు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు 1993లో ఇంద్రసేనా కేసులో తీర్పు ఇచ్చిందని, అయినా కేంద్రం అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీలు ఉద్యమిస్తుంటే అమలు చేయకపోవడం బీసీలపై వివక్షగా భావిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ న్యాయవాది కర్రె లచ్చన్న, నాయకులు భీమ్‌సేన్‌, చంద్రకాంత్‌, లతీఫ్‌, నాగరాజు, సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement