బాలికల్లో చాంపియన్ మహబూబ్‌నగర్ బాలుర విభాగంలో విజేతగా వరంగల్ ముగిసిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–19 టోర్నీ
మహబూబ్‌నగర్‌క్రీడలు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హైస్కూల్ మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 70వ రాష్ట్రస్థాయి అండర్–19 హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ముగి సింది. బాలికల విభాగంలో అతిథ్య ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు అద్వితీయమైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలిచింది. బాలుర విభాగంలో జిల్లా జట్టు ఫైనల్లో ఓడిపోయి రజతంతో సరి పెట్టుకుంది. బాలికల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. బాలుర విభాగం ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్ జట్టు మహబూబ్‌నగర్‌పై గెలు పొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచుల్లో మహబూబ్‌నగర్ కరీంనగర్‌పై, వరంగల్ జట్టు హైదరాబాద్‌పై గెలుపొందాయి. బాలికల విభాగం సెమీఫైనల్ మ్యాచుల్లో మహబూబ్‌నగర్ వరంగల్ జట్టుపై, కరీంనగర్ ఆదిలాబాద్ జట్లపై విజయాలు నమోదు చేసుకున్నాయి. బాలికల విభాగంలో ఆదిలాబాద్, బాలుర విభాగంలో కరీంనగర్ మూడోస్థానంలో నిలిచాయి. విజేతలకు ప్రముఖ పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈఎంఆర్‌ఎస్ రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్‌కుమార్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, హ్యాండ్‌బాల్ టోర్నీ రాష్ట్ర పరిశీలకులు రఫత్ ఉమర్, జి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.


