రెబ్బెన: గోలేటి టౌన్షిప్లోని సింగరేణి పాఠశాల మైదానంలో శనివారం ఉమ్మడి జిల్లా సెపక్తక్రా జోనల్స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14, 17, 19 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జనగామ జిల్లాలో ఈనెల 12 నుంచి 14 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి జిల్లా సెపక్తక్రా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తిరుపతి, రాష్ట్రస్థాయి కార్యవర్గ సభ్యులు భాస్కర్, మల్లేశ్ వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టుదలతో ఆడి జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో గోలేటి సర్పంచ్ అజ్మీర బాబురావు, సెపక్తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమ్మరి మల్లేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి పోశం, పీడీ వశీం ఖాన్, శారద, స్వప్న, పీఈటీ రవి తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న అండర్–14 జట్టు
అండర్–14 బాలుర జట్టులో సీహెచ్ హరీశ్, జె. అభిషేక్, డి.శివప్రణీత్, కె.కేశవరావు, కె.సాయి శ్రీ రాం, సీహెచ్ అంకిత్, జె.ప్రణీత్. బాలికల జట్టుకు కె.దర్శిని, ఎం.యాసశ్రీ, జి.అక్షయ, జి.స్వరూప, డి.వైష్ణవి, ఎ.సహస్విని, పి.ప్రితి ఎంపికయ్యా రు.


