ఐదుగురు వేటగాళ్లు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఐదుగురు వేటగాళ్లు అరెస్ట్‌

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

చెన్నూర్‌: చెన్నూర్‌ గోదావరి పుష్కర ఘాట్‌, బతుకమ్మ వాగు సమీపంలో వలలు ఏర్పాటు చేసి అడవి పందులను వేటాడుతున్న ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు ఎఫ్‌ఆర్వో చంద్రమౌళి తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక అటవీ కార్యాలయం ఆవరణలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో కొందరు వ్యక్తులు అడవి పందులను వేటాడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గోదావరి పుష్కర ఘాట్‌ సమీపంలో దుగ్యాల ఓదెలు, బాపు, జగన్నాధుల శ్రీనివాస్‌, పెద్ద పోచం, చిన్న పోచంను పట్టుకున్నామని తెలిపారు. పందులను పట్టేందుకు ఉపయోగించిన మూడు వలలు, ఒక బరిసే, రెండు అడవి పందులు, ఆటో ట్రాలీ, లూనా ఎక్స్‌ఎల్‌ వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరిపై వన్యప్రాణ సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్‌ఆర్వో ప్రభాకర్‌, బీట్‌ అధికారులు సంధ్యరాణి, రవీందర్‌, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement