రెబ్బెన: సింగరేణిలో పనిచేసే ఉద్యోగ క్రీడాకారులు క్రీడా నైపుణ్యాలు పెంచుకుంటూ పోటీల్లో రాణించాలని బెల్లంపల్లి ఏరియా ఎస్వోటూ జీఎం స్వామి రాజు అన్నారు. శనివారం గోలేటి టౌన్‌షిప్‌లోని భీమన్న స్టేడియంలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ 93వ వార్షిక క్రీడల్లో భాగంగా నియర్ బై అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల ఉద్యోగ క్రీడాకారులు సమిష్టిగా పాల్గొని కోలిండి యా పోటీల్లో పతకాలు సాధించాలన్నారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, డీజీఎం పర్సనల్ దేవరకొండ కిరణ్‌బాబు, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, కోఆర్డినేటర్ కిరణ్‌బాబు, జన రల్ కెప్టెన్ అబ్బాస్, ఏఐటీయూసీ నాయకులు మారం శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


