ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

క్లుప్తంగా

కాసిపేట/మందమర్రి రూరల్‌: ఆర్టీసీ బస్సులో మహిళ బంగారం చోరీకి గురైంది. శనివా రం కోరుట్ల డిపో ఆర్టీ సీ బస్సు మంచిర్యాల నుంచి కాగజ్‌నగర్‌ వె ళ్తోంది. మందమర్రి బ స్టాండ్‌ వద్ద కోటేశ్వరరావుపల్లెకు చెందిన సంధ్యారాణి తన పిల్లలతో కాగజ్‌నగర్‌ వెళ్లేందుకు బస్సెక్కింది. మందమర్రి యాపల్‌ చేరుకోగా పర్సులో ఉన్న బంగారం, అందులో మరో చిన్నపర్సు కనిపించలేదు. 2 ఉంగరాలు, ముక్కు పుడుకలు, మరో వస్తువు మొత్తం తులం వరకు బంగారం ఉన్నట్లు బాధిత మహిళ తెలిపింది. సోమగూడెంలో కాసిపేట ఎస్సై శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బస్సులో ఉన్న ప్రయాణికులను తనిఖీ నిర్వహించారు. అనంతరం బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మందమర్రి బస్టాండ్‌లో సీసీ కెమెరాల పరిశీలన, విచారణ నిమిత్తం బాధితురాలిని అక్కడికి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement