గనులు, డిపార్ట్‌మెంట్‌లపై నిరసన | - | Sakshi
Sakshi News home page

గనులు, డిపార్ట్‌మెంట్‌లపై నిరసన

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

మందమర్రిరూరల్‌: సమస్యల పరిష్కారానికి ఆగస్టు లో జరిగిన ఒప్పందం మేరకు హామీలు అమలు చేయాలని ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. బుధవారం ఏరియాలోని గనులు, డిపార్టమెంట్‌లపై నిరసన కార్యక్ర మం చేపట్టిన నాయకులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయడంలో యాజ మాన్యం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. ఏరియాలోని కార్మిక సమస్యలు కూడా పరిష్కరించాలని, ప్రతి నెలా క్రమం తప్పకుండా మెడికల్‌ బోర్డు నిర్వహించాలని, సొంతింటి పథకాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నాయకులు, ఫిట్‌ కార్యదర్శులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement