లక్ష్మణచాంద: మండలంలోని పీచర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జోనల్ లెవల్ బాస్కెట్ బాల్ సెలెక్షన్స్ నిర్వహించారు. బుధవారం మండలంలోని పీచర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అండర్ 14, 17 జోనల్ లెవల్ బాస్కెల్ బాల్ క్రీడలను నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులను జోనల్ స్థాయి జట్టుకు ఎంపిక చేశారు. ఇందులో అండర్ 14,అండర్ 17 బాలికల బాస్కెట్ బాల్ విభాగంలో నిర్మల్ జిల్లా జట్టు గెలుపొందగా, అండర్ 14 బాలుర విభాగంలో మంచిర్యాల జట్టు, అండర్ 17 విభాగంలో ఆదిలాబాద్ గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో డీటీ బాబుసింగ్, ఎంఈవో రాజు నాయక్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయులు సాయి క్రిష్ణ, భూషణ్, శంకర్, అశోక్, డేవిడ్, సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ వినీత్, మాజీ సర్పంచ్ లస్మన్న, పీడీలు తదితరులు పాల్గొన్నారు.


