ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లోనూ సత్తా చాటి ఆదిలాబాద్‌కు గుర్తింపు తీసుకురావాలని టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నవీన్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో బుధవారం విజయం సాధించిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించడం అభినందనీయమన్నారు. పోటీల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు మహిళా క్రీడాకారులు పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. గుడిహత్నూర్ మోడల్ స్కూల్‌కు చెందిన ప్రియ, సాక్షి, ప్రీతి, భీంపూర్ కేజీబీవీకి చెందిన శ్రీనిధి ప్రతిభ కనబరిచారని తెలిపారు. క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆదిలాబాద్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల నిర్వహణకు కృషి చేస్తామన్నారు. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సభ్యులు హరిచరణ్, కృష్ణసాగర్, వివేక్ పాల్గొన్నారు.


