ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్ –17 అథ్లెటిక్స్ పోటీలు ఖమ్మంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా డీఈవో వాసంతి క్రీడా పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ తొలిరోజు 1,500 మీటర్ల పరుగు పందెం పోటీ నిర్వహించామన్నారు. ఇందులో బాలుర విభాగం నుంచి ఎం.గణేశ్(నల్లగొండ) ఎం.చరణ్ తేజ(ఆదిలాబాద్), వి.గణేశ్(రంగారెడ్డి), బాలికల విభాగంలో ఎం.డీ.ఆస్మిన్(కరీంనగర్), ఎం.రాజేశ్వరి(ఆదిలాబాద్), పి.నక్షత్ర(రంగారెడ్డి) మొదటి మూడు స్థానాలు కై వసం చేసుకున్నారు.


