మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజుల పాటు జరుగనున్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల డివిజన్ స్థాయి క్రీడాపోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సురేష్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా మొదటి రోజు ఆరు పాఠశాలల విద్యార్థులు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్ పోటీల్లో పాల్గొన్నారు. ఏసీఎంవో లక్ష్మయ్య, హెచ్‌డబ్ల్యూవో స్వప్న, డీఎస్వో ధనలక్ష్మి, మాజీ డీఎస్వో జీవరత్నం పీడీ, పీఈటీలు గంగాభవాని, హరికుమార్, లక్ష్మణ్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


