● నీట్‌లో సత్తా చాటిన గ్రామ యువత
● పట్టుదల, క్రమశిక్షణతో విజయం
● ఉమ్మడి జిల్లాకు ఆదర్శం
● గ్రామానికి చెందిన గాండ్ల నారాయణ (ఎల్‌ఐసీ ఏజెంట్), పుష్పలత దంపతుల కుమారుడు గాండ్ల ప్రణవ సాయి అంకితభావంతో శ్రమించి నీట్‌లో అత్యుత్తమ ర్యాంకుతో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందారు.
● ఊరే సుదర్శన్, రత్నమాల దంపతుల కుమారుడు ఊరే విశ్వతేజ కఠోర సాధనతో నీట్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటి ఎంబీబీఎస్ సీటు కై వసం చేసుకున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ క్రమశిక్షణతో చదివి వైద్య కళాశాలలో ప్రవేశం పొందడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశ్వతేజ వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాలలో అడ్మిషన్ పొందారు.
● గ్రామానికి చెందిన ఏ. గంగాధర్ (ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్), విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కరుణశ్రీ దంపతుల కుమారుడు ఏ. శ్రీహిత్ మొహినాబాద్‌లోని ప్రఖ్యాత భాస్కర మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించారు.
● విద్యా చైతన్యానికి నిదర్శనంగా నిలిచారు కొతల్కర్ లక్ష్మణ్, అంజలి దంపతుల కుమార్తెలు. నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మణ్ ఓ కళాశాలలో ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా, అంజలి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద కుమార్తె రిషిత ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, చిన్న కుమార్తె సాయి సోనియా కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో అడుగుపెట్టారు.
బోథ్: మండలంలోని సొనాల గ్రామంలో విద్యా వాతావరణం రోజురోజుకూ బలపడుతోంది. గతంలో గ్రామం నుంచి ఉన్నత చదువుల్లో స్థిరపడిన వా రిని స్ఫూర్తిగా తీసుకుని, నేటి తరం విద్యార్థులు వై ద్య వృత్తిని తమ జీవిత ఆశయంగా ఎంచుకుంటున్నారు. సరైన మార్గదర్శకత్వం, పరస్పర సహకా రం, గ్రూప్ స్టడీస్‌తో కఠినమైన నీట్ పరీక్షను ఛేదించి విజయకేతనం ఎగురవేశారు. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నా రు. పట్టుదల, క్రమశిక్షణతో చదివి తెల్లకోటు ధరించి కళాశాలల్లో తొలి అడుగు వేసిన ఈ యువకిరణా లు ఉమ్మడి జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారు.
మెరిసిన ఆణిముత్యాలు..