నెన్నెల: మండలంలోని నందులపల్లి శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లును విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేసి బుధవారం సీజ్ చేసినట్లు కరీంనగర్ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్‌రావు, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ కె.శ్రీకళ తెలిపారు. విలువైన ధా న్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా రైస్ మిల్లు నిర్వాహకులు మోసగించారనే ఆరోపణల మేరకు మిల్లులోని ధాన్యం నిల్వలను పరిశీలించి పంచనామా నిర్వహించారు. ధా న్యానికి సంబంధించిన వివరాలు మిల్లింగ్ చేసిన ధాన్యం లెక్కలు, నిల్వలకు సంబంధించిన వివరాలు సేకరించి నివేదిక రూ పొందించారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు అధికారులు తెలిపా రు. ఉన్నతాధికారులు తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించా రు. తహసీల్దార్ పిప్పిరి శ్రీనివాస్, సివిల్ సప్ల య్ డీటీ కె.శ్రీనివాస్, సివిల్ సప్లయ్ ఇన్‌స్పెక్టర్ భూమేశ్, ఆర్‌ఐ సులోచన, జీపీఓ రజిత, సుజాత, పంచాయతీ కార్యదర్శి సరి త ఉన్నారు.
గూడ్స్ రైలు ఢీకొని
యువకుడు మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి రెండో నంబర్ ప్లాట్‌ఫాంకు వెళ్లడానికి పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని యువకుడు బుధవారం మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్సై మహేందర్ తెలిపారు. దండెపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌కు చెందిన బీరెళ్లి మురళి, పుష్పలత దంపతుల కుమారుడు శ్రీధర్ (46) పని మీద రైల్వే స్టేషన్‌కు వచ్చి రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లోకో పైలెట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
చీటింగ్ కేసులో
ఆరుగురికి మూడేళ్ల జైలు
జైపూర్: జైపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2016లో సింగరేణి వారసత్వ ఉద్యోగం పేరిట డబ్బులు వసూలు చేసిన ఆరుగురికి మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఏ.వీరయ్య మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. రామకృష్ణాపూర్‌కు చెందిన ఎడ్ల రాజిరెడ్డి అలియాస్ గంగారాం, కొత్తగూడెంకు చెందిన గుండేటి ప్రశాంత్‌కుమార్, ఎల్లూరి వెంకట నిర్మల్‌కుమార్, కొత్త వెంకటయ్య, మురళ హర్షవర్థన్‌రావు, పెద్దపల్లి జిల్లా బేగంపేటకు చెందిన ఒజ్జ కొమురయ్యపై గతంలో చెన్నూర్ జేఎఫ్‌సీఎం కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను విచారించిన మంచిర్యాల జిల్లా సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించినట్లు స్థానిక ఎస్సై భూమేశ్ తెలిపారు.


