పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

నస్పూర్‌: సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ డీప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి ఎస్‌కే బాజీ సైదాలు డిమాండ్‌ చేశారు. బుధవారం శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి జీఎం శ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యంతో ఆగస్టు 8న కుదిరిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్లకు నియామక పత్రాలు అందజేయాలని, మెడికల్‌ బోర్డు ప్రతీ నెల నిర్వహించాలని, మారుపేర్ల సమస్య పరిష్కరించాలని, ఉద్యోగ అర్హత వయస్సు 45 సంవత్సరాలకు పెంచాలని పేర్కొన్నారు. బ్రాంచి సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్‌, ఏరియా కార్యదర్శి సంపత్‌, జిల్లా కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్‌, నాయకులు నర్సయ్య, గండి సతీశ్‌, సురేశ్‌, నర్సింగరావు, సారయ్య, లచ్చన్న, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement