చెన్నూర్: భారత ప్రజాస్వామ్యంపై ప్రతిపక్షాలు దాడికి ప్రయత్నిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి అన్నారు. బుధవారం స్థానిక ఫంక్షన్ హాల్‌లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో మేధావులు, వివిధ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అరాచక శక్తులు పన్నిన కుట్రలో మనదేశ ప్రతిపక్ష పార్టీలు భాగస్వామ్యం అయి ఉద్యమాల పేరుతో దేశాన్ని అబాసుపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులు, జాతీయవాదులు ఏకతాటిపై నిలిచి ఈ ఆరాచక శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం ఆశోక్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, అక్కల రమేశ్, పట్టి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


