లైఫ్‌ సర్టిఫికెట్‌ రెన్యూవల్‌ చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

లైఫ్‌ సర్టిఫికెట్‌ రెన్యూవల్‌ చేసుకోవాలి

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

నస్పూర్‌: ప్రతీ సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి లైఫ్‌ సర్టిఫికెట్‌ను రెన్యూవల్‌ చేసుకోవాలని శ్రీరాంపూర్‌ జీఎం మునిగంటి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఆయన శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం వద్ద సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగులు, కోల్‌మైన్స్‌ పెన్షనర్ల సౌకర్యార్థం సీఎంపీఎంఎఫ్‌ గోదావరి ఖని రీజియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌పై అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం వద్ద ఈ నెల 4, 5 తేదీలలో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా విశ్రాంత ఉద్యోగులకు డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫి కెట్లు అందజేశారు. సీఎంపీఎఫ్‌ గోదావరిఖని రీజి నల్‌ కమిషనర్‌ గోవర్ధన్‌, గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, డీజీఎం (పర్సనల్‌) అనిల్‌కుమార్‌, డీవైపీఎం క్రాంతికుమార్‌, అన్ని గనుల సంక్షేమ అధికారులు, సీఎంపీఎంఎఫ్‌ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement