మంచిర్యాలటౌన్: అధిక ధరలకు బియ్యం విక్రయి స్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మెయిన్‌రోడ్డులో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి బియ్యం విక్రయించేందుకు వీలుగా శ్రీనాథ్ ట్రేడర్స్ నూతనంగా ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బీపీటీ, హెచ్‌ఎంటీ రకాల బియ్యం ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విక్రయించేందుకు గజానన్ ఇండస్ట్రీస్ ముందుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభా వంతో మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారులు, ట్రేడర్లు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బి య్యం విక్రయించాలని సూచించారు. 26కిలోల ప్రీ మియం క్వాలిటీ బీపీటీ రైస్‌బ్యాగ్‌ను రూ. 1,430కి, హెచ్‌ఎంటి స్టీమ్ రకాన్ని రూ.1,898కి విక్రయిస్తామని అవుట్‌లెట్ నిర్వాహకులు తెలిపారు. అనంతరం చున్నంబట్టి వాడలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణ పనులు పరిశీలించి, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


