‘కాంగ్రెస్‌ అరాచకాలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ అరాచకాలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

పాతమంచిర్యాల: ఓటరు సమగ్ర సవరణపై నిరసన పేరిట కాంగ్రెస్‌ చేస్తున్న అరాచకాల ను ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఇండియా పై విదేశీ శక్తుల ఆగడాలను అరికట్టాలని సి ర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌రావు, బీజే పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఽఘునాఽథ్‌ వెరబెల్లి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్‌లో సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధావుల సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడా రు. ఓటరు సమగ్ర సవరణ ద్వారా అక్రమ చొరబాటుదారులు, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించారే గాని దేశంలో ని ఏ ఒక్క అర్హుని ఓటు తొలగించలేదని వివరించారు. రాహుల్‌ గాంధీ విదేశీ శక్తులతో కలిసి దేశంలో అలజ డులు సృష్టించి మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, న్యాయవాదులు, వైద్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement