ఇది దండేపల్లి మండలం గూడెం గుట్ట. ఇక్కడ అర్ధరాత్రి దాటాకే అక్రమార్కులు అడ్డగోలుగా యంత్రాలతో గుట్టను తొలిచేస్తున్నారు. జేసీబీలతో మట్టిని తీసి ట్రాక్టర్లు, టిప్పర్లలో వందలాది క్యూబిక్ మీటర్లు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. యథేచ్ఛగా అక్రమ దందా సాగిస్తున్నారు.
బెల్లంపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో జరుగుతున్న మట్టి తవ్వకాలకు ఈ చిత్రంలోనే
గుంతలే ప్రత్యక్ష సాక్ష్యం. అడ్డూఅదుపు, అనుమతి లేకుండా అక్రమార్కులు ఇష్టారీతిన మట్టిని తవ్వుకుంటూ కావాల్సిన వారికి డిమాండ్ మేర సరఫరా చేస్తూ సొమ్ము
చేసుకుంటున్నారు.


