బెల్లంపల్లి: బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ, సింగరేణి భూముల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా రు. అక్రమార్కులు శ్మశాన వాటికలనూ వదల డం లేదు. మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికా రులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండగా కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మున్సిపల్ పరిధిలో ని ఒకటి, రెండు వార్డులు మినహా అన్ని చోట్లా ఇదే తంతు కొనసాగుతోంది. స్లాబ్ దశకు నిర్మాణాలు చేరుకున్నా అడ్డుకునేవారే లేరు. ఇందుకు రాజకీయ నాయకుల జోక్యమే కారణమా?.. అ ధికారులు ‘మామూలు’గా తీసుకోవడమా? అ నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలు ఇలాంటి నిర్మాణాలు చేపడితే వెంటనే పనిము ట్లు లాక్కెళ్తున్న మున్సిపల్ సిబ్బంది పెద్దవారి వద్దకు వెళ్లడంలేదనే ఆరోపణలున్నాయి.
కబ్జాలెన్నో.. చర్యలు కొన్నే..
మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ, సింగరేణి లీజు భూములు యథేచ్ఛగా దురాక్రమణకు గురవుతున్నాయి. అక్రమార్కులు తప్పుడు పత్రాలు సృష్టిస్తూ పాగా వేస్తున్నారు. ఇప్పటికే బుధాకలాన్ సర్వే నంబర్ 170లోని ప్రభుత్వ, సింగరేణి లీజు భూములను కబ్జా చేశారు. వీటిని అమ్ముకుంటున్నా పట్టించుకునేవారే లేరు. మున్ముందు ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలంటే గుంట భూమి లభించని పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీ పరిధి షంషీర్‌నగర్ బస్తీ శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా, అనుమతి లేకుండా షెడ్ నిర్మాణం చేసినట్లు స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో జేసీబీతో ఇటీవల మున్సిపల్ టౌన్ ఫ్లానింగ్ సిబ్బంది దానిని కూల్చివేశారు. మున్సిపాలిటీలోని కాంట్రాక్టర్ బస్తీకి చెందిన దొంగల భాగ్యలక్ష్మి అనే మహిళ అనధికారికంగా రెండో అంతస్తు నిర్మాణం చేపట్టడంతో ఆమెకు సెప్టెంబర్ 26న మున్సిపల్ అధికారులు రూ.5,79,150 భారీ జరిమానా విధించారు.
రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
నేషనల్ హైవే హన్మాన్ విగ్రహం పక్కన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతున్న విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. సదరు అధికారులు ముందుకు వస్తే జేసీబీని సమకూరుస్తామని చెప్పాం. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం చేపడున్న వ్యక్తికి ఇప్పటికే నోటీస్ జారీ చేశాం. అయినా మార్పు రాలేదు. మరో నోటీస్ అందజేసి అతడి
నిర్మాణాన్ని కూల్చివేస్తాం.
– రమేశ్, మున్సిపల్ కమిషనర్


