పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: భూముల రీ సర్వే, భూభా రతి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో వే గం పెంచి గడువులోపు పూర్తి చేయాలని భూ పరి పాలన ప్రధాన కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), కలెక్టరేట్‌ పరిపాలన అధికారులతో మాట్లాడారు. విజిలెన్స్‌ కేసుల పురోగతి, భూదా న్‌ భూములు, భూముల రీ సర్వే పురోగతి, హైకో ర్టు కేసులు, భూ భారతి పథకంలో పాత, కొత్త పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం, భూసేకరణ, యూ ఎల్‌సీ భూములు, జీవో 59, 76, 118ల కింద పెండింగ్‌లో ఉన్న భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తు ల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. భూదాన్‌ భూముల నివేదిక, భూముల రీ సర్వే ప్రక్రియ పురోగతి, న్యాయస్థానాల్లో పెండింగ్‌ భూ సంబంధిత కేసులు, భూసేకరణ అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. యూఎల్‌సీ భూములు, జీవో 59, 76, 118ల కింద పెండింగ్‌ క్రమబద్ధీకరణ దరఖాస్తులను గడువులోపు పరిష్కారాని కి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ రాములు మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే పనులు సమర్థవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణను గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. డీఆర్వో మోతీరాం, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాసరావు దేశ్‌పాండే, బీ, డీ సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement