కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

మందమర్రిరూరల్‌: కరువు మండలాల్లో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సారంగపల్లి, ఆదిల్‌పేట్‌, చిర్రకుంట, పొన్నారం గ్రామాల్లో పంటచేలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 349 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా కరువు మండలాలకు ప్రత్యేక అధికారుల బృందాలను పంపించి కరువు అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పాలకుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 10న కలెక్టరేట్‌ల ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, మందమర్రి పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజ్‌, నాయకులు వెంకటస్వామి, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్‌, సుదర్శన్‌, వనం సత్యనారాయణ, మిట్టపల్లి పౌల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement