● రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు
జైపూర్: హెల్మెట్ ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడింది. లారీ, మోటార్‌సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో అతడు లారీ ముందు టైర్ల వద్ద పడ్డాడు. హెల్మెట్ ధరించడంతో తలకు గాయాలేవీ కాకుండా ప్రాణాపాయం నుంచి బటయపడ్డాడు. ఎడమ కాలు నుజ్జునుజ్జయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బెజ్జాల గ్రామానికి చెందిన ఇన్నంనేని ముత్యంరావు పెద్దపల్లి జిల్లా సుందిళ్లలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం పని నిమిత్తం స్వగ్రామం బెజ్జాలకు మోటార్‌సైకిల్‌పై వస్తూ మండలంలోని ఇందారం ఐకే–1ఏ మైన్ క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా బొగ్గు లోడుతో శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ముందు టైర్ల వద్ద ముత్యంరావు(55) ఎడుమ కాలు నుజ్జునుజ్జయి విరిగిపోయింది. దీంతో 108వాహనంలో గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై భూమేశ్ తెలిపారు.


