రగ్బీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రగ్బీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

తాండూర్‌: మండలంలోని రేచిని జిల్లా పరిషత్‌ పా ఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాసాడి ప్రదీప్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో అయిళ్ల హర్షిత, మహ్మద్‌ జోయ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సదరు విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్‌, సర్పంచ్‌ పోతురాజుల రాంబాయి, ఉపసర్పంచ్‌ కొలిపాక భీమయ్య, పీడీ నిట్టూరి సంతోష్‌కుమార్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement