లాయర్స్‌ యూనియన్‌ కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

లాయర్స్‌ యూనియన్‌ కమిటీ ఎన్నిక

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

బెల్లంపల్లి: ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ బెల్లంపల్లి కోర్టు కమిటీని మంగళవారం కోర్టు ఆవరణలోని అసోసియేషన్‌ కార్యాలయంలో ఎన్నుకున్నారు. బెల్లంపల్లి కోర్టు కమిటీ అధ్యక్షుడిగా మాసు సుధాకర్‌, ప్రధాన కార్యదర్శిగా మురళి శ్రావణ్‌, ఉపాధ్యక్షులుగా జాడి రాజేశ్‌, దేవరాజ్‌, సహాయ కార్యదర్శులుగా అనిల్‌ కుమార్‌, జుబేర్‌, కోశాధికారిగా కుమార్‌, మరో ఆరుగురిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.

మహిళా కమిటీ కన్వీనర్‌గా..

ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ బెల్లంపల్లి కోర్టు మహిళా కమిటీ కన్వీనర్‌గా తౌటం సౌమ్య, కో కన్వీనర్లుగా పీ. మమత, అరకొండ లావణ్య, దుర్గమ్మ, సభ్యులుగా మరో ఇద్దరిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యల ఏమాజీ, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్‌ వ్యవహరించారు. కొత్తగా ఎన్నికై న కమిటీ సభ్యులను పలువురు న్యాయవాదులు అభినందించి శాలువాతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement