మత్తులో పాఠశాలకు వచ్చిన ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంపై వేటు | - | Sakshi
Sakshi News home page

మత్తులో పాఠశాలకు వచ్చిన ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంపై వేటు

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

ఆదిలాబాద్‌టౌన్‌: మద్యం మత్తులో పాఠశాలకు వచ్చారనే ఆరోపణతో ఇచ్చోడ జెడ్పీఎస్‌ఎస్‌ హెచ్‌ఎం వెంకటరమణపై డీఈవో కొరడా ఝు ళిపించారు. ఎఫ్‌ఏసీ హెచ్‌ఎం బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జా రీ చేశారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లగా విచారణ చేపట్టాలని డీఈ వో మాధవి, డీఐఈవో జాదవ్‌ గణేశ్‌ కుమార్‌ను ఆదేశించా రు. విచారణ కోసం ఇచ్చోడ ఎంఈవో ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ, శాఖ పరమైన విచా రణలో హాజరు కాలేదని పేర్కొన్నారు. ఎఫ్‌ఏసీ హెచ్‌ఎం బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆయన స్థానంలో సోషల్‌ ఎస్‌ఏగా పనిచేస్తున్న ఆర్‌.సురేష్‌ కుమార్‌కు ఫుల్‌ అడిషనల్‌ చార్జి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement