దండేపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఒకటి రెండు కోతులు వస్తేనే తరిమికొట్టడం కష్టం. అలాంటిది పెద్ద వానర సైన్యమే ప్రత్యక్షమైతే ప్రజలకు చెప్పలేనంతా భయమే. దండేపల్లిలో గత కొన్నేళ్లుగా కోతుల బెడద ఉన్నప్పటికీ ఇటీవల గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుగుండా ఒంటరిగా వెళ్లాలన్నా.. దారి పొడవునా, ఇళ్ల సమీపంలో, ఇళ్లపైనా ఎక్కడ చూసిన కోతులే కనిపిస్తుండడంతో జనాలు వణికిపోతున్నారు. పాలకులు, అధికారులు దృష్టి సారించి కోతులను బంధించి అడవుల్లో వదిలిపెట్టాలని కోరుతున్నారు.


