కౌలుకోలేని దెబ్బ | - | Sakshi
Sakshi News home page

కౌలుకోలేని దెబ్బ

Nov 4 2026 12:09 AM | Updated on Nov 4 2026 12:09 AM

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో కౌలురైతు కుదేలు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు రాక ఆర్థిక నష్టం భూ యజమానికే పంట నష్ట పరిహారం, పెట్టుబడి సాయం

బజార్‌హత్నూర్‌: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన వరి, పత్తి, కంది, సోయాబీన్‌, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న పంటలు ఎండిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. భూగ ర్భ జలాలు అడుగంటిపోవడం, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల్లోని నీటిని సాగుకు వాడవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో రబీ సాగుపై రైతుల ఆశలు అడుగంటాయి. ఖరీఫ్‌ సాగులో నష్టం, రబీ సాగుచేయలేని పరిస్థితి రావడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మూడేళ్లలో నాలుగింతలు..

మూడేళ్లలో కౌలు ధరలు నాలుగింతలు పెరిగాయి. నాలుగేళ్ల క్రితం ఎకరం పంటచేను కౌలుకు తీసుకుంటే రూ.10 వేల లోపు మాత్రమే ఉండేది. ప్రస్తు తం ఆదిలాబాద్‌ జిల్లాలోని తాంసి, తలమడుగు, జైనథ్‌, బేల, ఇచ్చోడ, బోథ్‌, గుడిహత్నూర్‌, నిర్మల్‌ జిల్లాలోని కుభీర్‌, ఖానాపూర్‌, నిర్మల్‌ మండలాల్లో రూ.20 వేలు దాటింది. అంతేకాకుండా ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు, కూలీ ల ఖ ర్చులు రెట్టింపయ్యాయి. పెరిగిన ధరలకు తోడు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక ఏటా కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో కౌలు రైతులు

ఎందుకీ వివక్ష

కౌలురైతులను ఆదుకునేందుకు 2011లో ప్రభుత్వం రూపొందించిన చట్టం సైతం వారిని ఆదుకోవడం లేదు. గతేడాది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిండంతో ఉమ్మడి జిల్లాలో 63 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అమలుకు నోచుకోవడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1,17,268 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ ఏడాది వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడటంతో దిగుబడులు రాక ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి దాపురించింది.

కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం కౌలురైతుల సంక్షేమానికి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం (రైతు భరోసా) కూడా పట్టా దారు చేతికే అందుతుంది. కనీసం రుణ అర్హత కార్డులు కూడా లేక కౌలు రైతులు అప్పుల కోస ం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటులో ఎక్కువ వడ్డీకి ప్రైవేటు అప్పులు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పండక నష్టపోతే పరిహారం కూడా భూ యజమానికే వస్తుంది. దీంతో కౌలురైతు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement