తాండూర్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో నిర్వహించిన జోనల్‌స్థాయి వాలీబాల్ పోటీల్లో మండలంలోని అచ్చలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మారిశెట్టి అమూల్య ప్రతిభ కనబ ర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సాంబమూర్తి తెలిపారు. పోటీల్లో మంచి ర్యాల జిల్లా జట్టు ప్రథమస్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ కై వసం చేసుకుంది. ఈ నెల 5 నుంచి 7వరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగే పోటీల్లో అ మూల్య పాల్గొననుంది. ప్రధానోపాధ్యాయురాలు ఉమాదే వి, సర్పంచ్ మారిశెట్టి స్రవంతి, ఉపసర్పంచ్ గట్టు సంతోష్‌కుమార్, నాయకులు మారిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.


