మంచిర్యాలఅగ్రికల్చర్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు సేవలు చేయడం, ప్రీ–స్కూల్ విద్య తదితర సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం వేతనాలు, బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతోపాటు అదనపు విధుల భారం మోపుతోందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు ప్రభుత్వం అంగన్వాడీలకు రూ.18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.10వేల పింఛన్ అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు భూపతి రమాదేవి, సరస్వతి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అక్బర్‌అలీ, నాయకులు అప్రోజ్, పి.సురేఖ, అరుణ, తిరుమల, ఇంద్ర, శంకరమ్మ, కుసుమకుమారి, పద్మారెడ్డి, అరుణ, సరోజ, శైలజ, కనకలక్ష్మి, శారద, సంధ్య తదితరులు పాల్గొన్నారు.


