కాసిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలకు చెందిన విద్యార్థులు విశ్వకర్మ, చరణ్‌తేజ్, అక్షయ్‌లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న ట్లు కళాశాల పీడీ బాబురావు తెలిపారు. శనివారం ఆదిలాబాద్‌లో జరుగుతున్న ఉమ్మడి జిల్లా అండర్17 అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరచి సంగారెడ్డిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఏంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విశ్వకర్మ 800మీటర్లలో మొదటిస్థానం, 1500మీటర్లలో ద్వితీయ స్థానం, చరణ్‌తేజ 300మీటర్లు, 1500మీటర్లలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. 19సంవత్సరాల విభాగంలో అక్షయ్ 1500మీటర్లలో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను మంచిర్యాల డీఐఈవో అంజయ్య, ప్రిన్సిపాల్ శంకర్, సిబ్బంది అభినందించినట్లు తెలిపారు.


