స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

రెబ్బెన: స్వచ్ఛమైన, నాణ్యతతో కూడిన స్వదేశీ ఉ త్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీరమేశ్‌ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్‌ క్లబ్‌లో శనివారం వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ వారు ఏర్పాటు చేసిన ఖాదీ మేళా స్టాల్‌ను జీఎం ప్రారంభించారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వే సి నివాళి అర్పించారు. అనంతరం స్టాల్‌లోని వస్త్రాలను పరిశీలించారు. రాయితీ వివరాలు అడిగి తెలు సుకున్నారు. నవంబర్‌ 7వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగే ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్‌. తిరుపతి, ఏరియా ఇంజనీరు వీరన్న, డీజీ ఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్‌బెహరా, సీనియర్‌ పర్సనల్‌ అధికారి శ్రీనివాస్‌, ప్రశాంత్‌ నిర్వాహకులు చంద్రమౌళి, రాజేశ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement