కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్య రైతులు, మత్స్యకారులకు దేశవాళీ తెల్లచేపల పెంపకంపై ఇస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. ఖమ్మం, ఆసిఫాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాల మత్స్యకారులు శిక్షణలో పాల్గొనగా, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం ఫార్మర్ డీన్ డాక్టర్ రవీంద్రకుమార్రెడ్డి పలు అంశాలపై అవగాహన కల్పించారు. దేశవాళీ చేపల పెంపకంలో యాజమాన్య పద్ధతులు తదితర అంశాలను వివరించారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పాలేరు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు రవీందర్, శాంతన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


